పవన్ కు వార్నింగ్ ఇచ్చిన అలీ

253

Actor ali counter on pawan kalyan

పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చి షాక్ ఇచ్చాడు హాస్య నటుడు అలీ . పవన్ కళ్యాణ్ – అలీ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే . అయితే రాజకీయాల వల్ల ఇద్దరు మిత్రులు ఇద్దరు ప్రత్యర్ధులు అయ్యారు విమర్శలు చేసుకుంటున్నారు . అలీ జగన్ సమక్షంలో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే . దాంతో షాక్ అవ్వడం పవన్ కళ్యాణ్ వంతు అయ్యింది .

దాంతో అలీ నన్ను వదిలేసి జగన్ పంచన చేరాడని ., అక్కడ అతడికి రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని వెళ్లి ఉండొచ్చని కానీ అతడి బంధువు కు సీటు కావాలంటే నరసారావు పేట సీటు ఇచ్చానని కానీ నాకు చెప్పాపెట్టకుండా జగన్ పార్టీలో చేరాడని అందుకే స్నేహం మీద నమ్మకం లేకుండా పోయిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాడు పవన్ .

ఇక అలీ ఊరుకుంటాడా ? నాకు సినిమాలు ఇప్పించావా ?డబ్బులు సహాయం చేసావా ? నాకు ఛాన్స్ లు ఇవ్వమని ఎవరినైనా అడిగావా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు అలీ . అంతేకాదు మీ లాగా నేను విమర్శలు చేయను అంటూ ఓ వార్నింగ్ కూడా ఇచ్చాడు అలీ . పవన్ కళ్యాణ్ కు చెందిన పలు విషయాలు అలీ కి బాగా తెలుసు ? ఎక్కువ వాగితే అవి బయట పెడతాను అన్న హెచ్చరిక అలీ లో కనిపించింది . మొత్తానికి రాజకీయాలు ఏమైనా చేయగలవు అన్నదానికి ఉదాహరణే ఈ ఇద్దరూ.