బోయపాటి కూడా బహిరంగ లేఖ రాస్తాడా?

56

రామ్ చరణ్ రాసిన బహిరంగ లేఖ చర్చనీయాంశం అవుతూనే ఉంది. ముఖ్యంగా ఇందులో చరణ్ ఎక్కడా చిత్ర దర్శకుడు బోయపాటి పేరు ప్రస్తావించకపోవడం వివాదాస్పదమవుతోంది. ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణలకు, నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపి, అభిమానులకు, ప్రేక్షకులకు సారీ చెప్పిన రామ్ చరణ్.. బోయపాటి పేరు ప్రస్తావించకపోవడం ద్వారా.. ఈ చిత్ర పరాజయానికి కారకుడు అతనే అని పరోక్షంగా తేల్చి చెప్పాడు. సహజంగానే ఇది బోయపాటి అహాన్ని దెబ్బ తీస్తోంది. అందుకే అతను కూడా ఓ బహిరంగ లేఖ రాయాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. తను తీయాలనుకున్న విధంగా సినిమాను తీయనివ్వలేదని, ఏదైనా అందుకు పూర్తి బాధ్యత తాను వహిస్తానని అందులో బోయపాటి పేర్కొనబోతున్నాడని తెలుస్తోంది!!