ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు

52

 celebrities casts his-vote

ఈరోజు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు . మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ , అలాగే చరణ్ ,ఉపాసన , చిరు పెద్ద కూతురు సుస్మిత లతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు . అలాగే ఎన్టీఆర్ తన తల్లి షాలిని , భార్య ప్రణతి తో కలిసి వచ్చి ఓటు వేశారు . అల్లు అర్జున్ , అమల , ఎం ఎం కీరవాణి తదితర సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు .

మంచు లక్ష్మీప్రసన్న , మంచు మనోజ్ తదితర ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు . సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల ఇతరులకు తప్పకుండా స్ఫూర్తిదాయకంగా నిలవడం ఖాయమని అంటున్నారు ప్రజాస్వామ్య వాదులు . అయితే హైదరాబాద్ లో ఓటింగ్ మందకొడిగా సాగుతోంది.

ఓటు వేసిన బాలకృష్ణ
సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆయన సతీమణి వసుంధరతో కలిసి ఓటు వేశారు.
Balakrishna Casting his Right to Vote

celebrities casts his-vote

pawankalyan