బాలయ్య మళ్ళీ హిందూపూర్ లో గెలుస్తాడా ?

65

నటసింహం నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుండి మళ్ళీ పోటీకి సిద్దమయ్యాడు . అసలే ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు కూడా దారుణమైన పరాజయాలను చవి చూడటంతో మానసికంగా బాగా కుంగిపోయాడు . తెలుగువాడి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన మహనీయుడి కథ కాబట్టి బ్రహ్మరథం పడతారు అని భావించాడు బాలయ్య . కానీ బాలయ్య ఊహలకు భిన్నంగా ప్రేక్షకులు రెండు చిత్రాలను కూడా తిప్పికొట్టారు దాంతో డిజాస్టర్ లు అయ్యాయి .

సూపర్ హిట్ అవుతాయని అనుకున్న సినిమాలు ప్లాప్ కావడంతో నీరసపడిన బాలయ్య కు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రావడంతో మరింత కుంగిపోయాడట . ఈ సమయంలో బాలయ్య హిందూపూర్ లో గెలుస్తాడా ? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు . హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అందునా నందమూరి వంశానికి మరీ ప్రీతిపాత్రమైంది . అయితే గత ఎన్నికల్లో బాలయ్య గెలిచినప్పటికీ అక్కడి ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకున్న దాఖలాలు లేవు . ఇక గత ఏడాది అయితే బాలయ్య పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసారు అక్కడి ప్రజలు . ఒకవైపు బయోపిక్ ప్రభావం మరోవైపు ఎన్నికలు దీంతో బాలయ్య మళ్ళీ గెలుస్తాడా ? అన్న అనుమానం అయితే ఉంది . ఇక్కడ బాలయ్య గెలిస్తే నిజంగా వింతే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారంటే ఎంత ఘోరంగా పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు .