ఏందిరా ….. పవన్ కళ్యాణ్ అంటున్న శ్రీ రెడ్డి

222

Sreereddy-pawankalyan

ఏందిరా ….. పవన్ కళ్యాణ్ నీ యాక్టింగులు అంటూ పవన్ కళ్యాణ్ ని ఘోరంగా తిడుతూ మరోసారి సంచలనం సృష్టించింది వివాదాస్పద భామ శ్రీ రెడ్డి . కాస్టింగ్ కౌచ్ ఆరోపనలతో సంచలనం సృష్టించిన ఈ భామ తాజాగా పవన్ కళ్యాణ్ పై అలాగే నాగబాబు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది . ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో శ్రీ రెడ్డి వ్యాఖ్యలు మరింత వివాదాన్ని సృష్టించేలా ఉన్నాయి .

విమర్శలు చేయొచ్చు కానీ ఒరేయ్ ….. అంటూ మరీ దిగజారిన విమర్శలు మాత్రం పవన్ కళ్యాణ్ ని మాత్రమే కాదు పవన్ ఫ్యాన్స్ ని కూడా బాధపెట్టడం ఖాయం . బొచ్చెలో అన్నం తినడం ఏంటి ? వారసత్వ రాజకీయాలు చేయనని చెప్పిన నువ్వు నీ అన్నకు ఎలా సీటు ఇచ్చావ్ ? అంటూ పవన్ ని కడిగిపడేసింది శ్రీ రెడ్డి . మొత్తానికి పవన్ కళ్యాణ్ పై బాగానే పగబట్టింది శ్రీ రెడ్డి . ఇక పనిలో పనిగా నాగబాబు ని కూడా దులిపేసింది శ్రీ రెడ్డి . తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ శ్రీ రెడ్డిని బండబూతులు తిట్టడం ఖాయం.