జగన్ గెలిస్తే చంద్రబాబు జైలుకేనా ?

52

Jagan-Mohan-Reddy

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అప్పుడే జగన్ ముఖ్యమంత్రి అయిపోయినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు జగన్ తో పాటుగా ఆ పార్టీ నేతలు , కార్యకర్తలు . అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా చంద్రబాబు అంటే మండిపడుతోంది దాంతో కేసీఆర్ , కేటీఆర్ లు చంద్రబాబు కు వ్యతిరేకంగా జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ బాబు ని ఇబ్బంది పెడుతున్నారు . ఈ ఇద్దరికీ తోడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు పట్ల గుర్రుగా ఉన్నాడు దాంతో మరో రెండు నెలల్లో ఏపీలో జరిగే ఎన్నికల్లో చంద్రబాబు అధికారం కోల్పోతే జైలు కెళ్ళడం ఖాయమని అంటున్నారు .

నరేంద్ర మోడీ , కేసీఆర్ , జగన్ ముగ్గురు కూడా చంద్రబాబుని గద్దె దించాలన్న కసితో ఉన్నారు . చంద్రబాబు కు కంటి మీద కునుకు లేకుండా ముప్పేట దాడి చేస్తున్నారు దాంతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు . ఇవన్నీ చాలవన్నట్లుగా తెలుగుదేశం పార్టీ నుండి పలువురు నాయకులు జగన్ పార్టీలో చేరుతున్నారు , కాగా కొంతమంది ఏమో ఎలాగూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు కాబట్టి పోటీ చేసి నష్టపోవడం ఎందుకు అన్నట్లుగా ఎన్నికల్లో పోటీకి సుముఖత చూపడం లేదు . దాంతో ఇంటా బయటా సమస్యలతో సతమతం అవుతున్నాడు బాబు . ఇప్పటివరకు ఉన్న సమస్యలకు తోడు కొత్తగా ఐటీ గ్రిడ్ సమస్య వచ్చి పడింది చంద్రబాబు నెత్తి మీద . మోడీ , కేసీఆర్ , జగన్ ల మూకుమ్మడి దాడి వల్ల సానుభూతి వ్యక్తమై మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వస్తే సమస్య లేదు కానీ కేంద్రంలో మళ్ళీ మోడీ , ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి వస్తే మాత్రం చంద్రబాబుకు చుక్కలు చూపించడం ఖాయం , జైలులో పెట్టడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు .