మిస్‌ యూఎస్‌ఏ అందాల పోటీలో మెరిసి టాలీవుడ్‌కి ఎంట్రీ!

44

Miss USA international beauty talent contest 2019

బ్యూటీ కాంటెస్టుల్లో గెలిచిన భామలు హీరోయిన్లుగా సినిమాల్లో ఎంపిక కావడం గతంలో చాలాసార్లు చూశాం. సుస్మితా సేన్, ఐశ్వర్యా రాయ్, ప్రియంకా చోప్రా వంటి తారలు ముందు అందాల పోటీల్లో పాల్గొని, లైమ్‌లైట్‌లోకి వచ్చారు. అక్కడ్నుంచి సినిమాల్లోకి వచ్చారు. లేటెస్ట్‌గా జో శర్మ (జ్యోత్స్న) ఈ లిస్ట్‌లో జాయిన్‌ కాబోతున్నారు. కాలిఫోర్నియాలో జరిగిన యూఎస్‌ఏ ఇంటర్నేషనల్‌ బ్యూటీ అండ్‌ టాలెంట్‌ కాంటెస్ట్‌ 2019 విజేతగా నిలిచారు జో శర్మ. (జ్యోత్స్న)

15 దేశాలకు చెందిన 15 మంది ఈ పోటీలో పాల్గొన్నారు. అందం, ప్రతిభ, నృత్యం, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ స్పీచులు.. ఇలా అన్నింటి ఆధారంగా విజేతను నిర్ణయించారు. అన్నింటిలోనూ జో శర్మ తన ప్రతిభ కనబర్చి, ‘మిస్‌ యూఎస్‌ఏ’ టైటిల్‌ గెలిచారు. త్వరలో ఆమె టాలీవుడ్‌కి పరిచయం కానున్నారు. ప్రస్తుతం ‘లవ్‌ 2020’ చిత్రాన్ని రూపొందిస్తున్న నిర్మాత మోహన్‌ వడ్లపాటి త్వరలో రూపొందించబోయే మరో చిత్రం ద్వారా జో శర్మను హీరోయిన్‌గా పరిచయం చేయనున్నారు. మరొక తెలుగమ్మాయి వెండితెరపై మెరవబోతోంది. అమెరికాలో అందాల పోటీల్లో మెరిసిన జో శర్మ (జ్యోత్స్న) కథానాయికగా త్వరలోనే ఓ చిత్రం చేయబోతున్నట్టు నిర్మాత మోహన్‌ వడ్లపట్ల తెలిపారు. తెలుగమ్మాయైన జో శర్మ అమెరికాలోని శాంటా క్లారా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ‘మిస్‌ యూఎస్‌ఏ ఇంటర్నేషనల్‌ బ్యూటీ అండ్‌ టాలెంట్‌ కాంటెస్ట్‌- 2019’లో పాల్గొని విజేతగా నిలిచారు. మోడలింగ్‌, డ్యాన్సింగ్‌ యాక్టింగ్‌తో పాటు… మహిళా సాధికారికత గురించి ప్రసంగించిన జో శర్మ విజేతగా నిలిచారనీ మోహన్‌ వడ్లపట్ల తెలిపారు.

Indian won the Miss USA international beauty talent contest 2019