బాబు సినిమా బన్నీతో

62

‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తనను పదే పదే స్క్రిప్ట్ లో చేంజెస్ చేయమని మహేష్ బాబు చెబుతుండడం.. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో లీకవుతుండడంతో మనస్థాపం చెందిన సుకుమార్.. మహేష్ సినిమా పక్కన పెట్టేసి.. బన్నీతో సినిమా చేయడానికి సిద్ధపడిపోయాడు. బన్నీ నటించిన ‘ఆర్య’తో దర్శకుడిగా మారిన సుకుమార్.. బన్నీతో ‘ఆర్య-2’ తీశాడు. ఇది ‘ఆర్య’ అంత సంచలన విజయం సాధించకపోయినా.. మంచి విజయం సాధించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ జత కడుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం త్వరలో సెట్స్ కి వెళ్లనుంది!!