ఏబీసీడీ తో నైనా హిట్ కొడతాడా ? 

45

Allu-Sirish-ABCD-first-look-759

అల్లు అరవింద్ తనయుడిగా , అల్లు అర్జున్ సోదరుడిగా తెరంగేట్రం చేసాడు అల్లు శిరీష్ . అయితే హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఒక్క సినిమా కూడా సాలిడ్ హిట్ కొట్టలేదు కాకపోతే శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా మాత్రం ఫరవాలేదనిపించింది . అంతేకాదు అల్లు శిరీష్ నటనపై కూడా మొదట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి . కట్ చేస్తే మెల్లి మెళ్లిగా తనని తాను మార్చుకుంటూ వస్తున్నాడు .

తాజాగా ఏబీసీడీ అనే సినిమా చేసాడు . మలయాళంలో విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో ఎబిసిడి గా రీమేక్ చేస్తున్నారు . ఇక ఈ సినిమా మే 17 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈరోజు ఏబీసీడీ ట్రైలర్ ని దర్శకులు త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదల చేసారు . ట్రైలర్ చూస్తుంటే తప్పకుండా హిట్ అయ్యేలాగే కనిపిస్తోంది దాంతో అల్లు శిరీష్ నమ్మకంగా ఉన్నాడు . కానీ హిట్ అవుతుందా ? లేదా ? అన్నది మాత్రం మే 17 న తేలనుంది .