ఆర్ ఆర్ ఆర్ బడ్జెట్ ఎంతో తెలుసా

43

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ ఎత్తున ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే . ఎన్టీఆర్ , రాంచరణ్ , అజయ్ దేవ్ గన్ , అలియా భట్ , సముద్రఖని తదితరులు నటిస్తున్న ఈ భారీ చిత్రాన్ని తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ , హిందీ బాషలలో పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు . డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్ర బడ్జెట్ ఎంతో తెలుసా ……. 400 కోట్లు .

నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ ” ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని నిర్మించే అదృష్టం నాకు దక్కడం గొప్ప వరంగా భావిస్తున్నాను , ఇక ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నాను . 350 కోట్ల నుండి 400 కోట్ల వరకు ఈ సినిమాకు ఖర్చు అవుతోందని అసలు విషయాన్నీ చెప్పాడు . 400 కోట్ల బడ్జెట్ అయినప్పటికీ రాజమౌళి , ఎన్టీఆర్ , చరణ్ ల వల్ల 1000 కోట్లకు పైగా బిజినెస్ అవ్వడం ఖాయం .