ఎన్టీఆర్ ని రిజెక్ట్ చేసిన సీనియర్ హీరోయిన్

744

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ వదులుకోదు , ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా నటించే వాళ్ళు అయితే అస్సలు ఆ ఛాన్స్ వదులుకోరు కానీ సీనియర్ హీరోయిన్ లయ మాత్రం ఎన్టీఆర్ సినిమాని రిజెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఇంతకీ లయ రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్ సినిమా ఏంటో తెలుసా………అరవింద సమేత వీర రాఘవ .

అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో లయ ని ఓ పాత్రకు ఎంపిక చేశారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే నాకు గట్టిగా కొడితే 35 ఏళ్ళు లేవు అలాంటి నేను తల్లి పాత్ర చేయడం ఏంటి ? అని ఆ పాత్రని రిజెక్ట్ చేసిందట . పైగా ఈ విషయాన్ని లయ స్వయంగా వెల్లడించడం విశేషం. స్వయం వరం చిత్రంతో 1999 లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది లయ. అయితే పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడటంతో సినిమాలకు దూరమయ్యింది. మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానని అంటోంది లయ.