పవన్ కళ్యాణ్-మహేష్ బాబు బాటలో బన్నీ?

25
Allu Arjun-Trivikram film after Shivratri
‘ఖుషి’ తర్వాత రెండేళ్ల విరామంతో పవన్ కళ్యాణ్ నటించిన ‘జానీ’ వచ్చింది. అతిధి’ తర్వాత మహేష్ బాబు సినిమా ‘ఖలేజా’ కూడా రెండేళ్ల గ్యాప్ తరువాత వచ్చింది. చూస్తుంటే అల్లు అర్జున్ తదుపరి చిత్రం రావడానికి కూడా ఇంచుమించుగా అంతే సమయం పట్టేలా ఉంది. 
ప్రముఖ రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ విడుదలై సంవత్సరం కావస్తోంది. బన్నీ నటించే తదుపరి చిత్రం ఎవరితో అనే దానిపై క్లారిటీ వచ్చినప్పటికీ.. ఇప్పటివరకు సెట్స్ కి వేళ్ళ లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించే ఇంకా పేరు పెట్టని తదుపరి చిత్రం సెట్స్ కి వెళ్లిన దగ్గర నుంచి మినిమమ్ ఏడెనిమిది నెలలు పడతాది అనుకున్నా.. ఈ ఏడాది చివరికి కానీ ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదు. అంటే.. పవన్, మహేష్ లానే బన్నీ కెరీర్ లోనూ రెండేళ్ల విరామం రానున్నదన్నమాట.!!
 
కొసమెరుపు: మిర్చి తర్వాత ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ కూడా రెండేళ్లకు కానీ విడుదల కాలేదు. అయితే.. ‘బాహుబలి’ చిత్రం ‘మిర్చి’ రిలీజ్ అయిన వెంటనే మొదలయింది.