అమితాబ్ బచ్చన్ ఎన్ని కోట్ల టాక్స్ కట్టాడో తెలుసా

31

amithab-bachchan

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 2018 – 19 ఆర్ధిక సంవత్సరానికి గాను ఎంత టాక్స్ కట్టాడో తెలుసా …… 70 కోట్లు . అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే ! అమితాబ్ అక్షరాలా 70 కోట్ల ఆదాయపు పన్ను కట్టాడు . ఈ విషయాన్నీ అమితాబ్ ప్రతినిధి పేర్కొనడం విశేషం . అమితాబ్ బచ్చన్ ఇప్పటికి కూడా సినిమాల్లో నటిస్తున్నాడు కానీ హీరోగా మాత్రం నటించడం లేదు .

సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తున్నాడు , అలాగే దేశ వ్యాప్తంగా కమర్షియల్ యాడ్స్ చేస్తున్నాడు కూడా . కమర్షియల్ యాడ్స్ లలో నటించడం వల్ల పెద్ద మొత్తంలోనే డబ్బులు వస్తున్నాయి దాంతో 70 కోట్ల టాక్స్ కట్టాడు అమితాబ్ బచ్చన్ . ఇటీవలే బద్లా చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు అమితాబ్ .