బండ్ల గణేష్ సంచలన నిర్ణయం

116

Bandla Ganesh quits politics

నిత్యం పవన్ కళ్యాణ్ నామ స్మరణ చేసే నిర్మాత , నటుడు బండ్ల గణేష్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు . రాజకీయాల్లో అడుగు పెట్టిందే మూడు నెలలు కానీ అప్పుడే రాజకీయాలకు గుడ్ బై చెప్పేసాడు బండ్ల. గత ఏడాది నవంబర్ లో జరిగిన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు బండ్ల గణేష్ . శంషాబాద్ లేదా జూబ్లీహిల్స్ లలో ఏదో ఒక స్థానం నుండి అసెంబ్లీ కి పోటీ చేయాలనీ భావించాడు కానీ టికెట్ దక్కలేదు .

పార్టీ కూడా ఘోరంగా ఓడిపోయింది , దాంతో సైలెంట్ అయిపోయాడు . అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చాయి , తన దేవుడు పవన్ కళ్యాణ్ జనసేన తరుపున పలువురు అభ్యర్థులను పోటీకి నిలిపాడు దాంతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ట్వీట్ చేసాడు . కట్ చేస్తే ఏమయ్యిందో ఏమో కానీ రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ట్వీట్ పెట్టి మరింత సంచలనం సృష్టించాడు . రాజకీయాల్లోకి వచ్చి ఏదో వెలగబెడదామని అనుకున్నాడు పాపం ! కానీ మూన్నాళ్ళ ముచ్చటే అయ్యింది బండ్ల గణేష్ పరిస్థితి.