చీకటి గదిలో పెట్టి చితక్కొట్టాలి

188

‘న బూతో న భవిష్యత్’ అన్నది ఈనాటి మాట కాదు. ఏనాటిదో. బూతు లేకపోతే భవిష్యత్తు లేదని దాని అర్ధం. ముఖ్యంగా మన భారతీయ సినిమాల్లో బూతు ఈమధ్య కాలంలో మరీ ఎక్కువైపోయింది. జనాలు చూస్తున్నారు కనకనే.. తీస్తున్నామని సినిమావాళ్లు.. వాళ్ళు చూపిస్తున్నారు కనకనే చూస్తున్నామని ప్రేక్షకులు అంటున్న మాటలు వింటుంటే.. విత్తు ముందా.. చెట్టు ముందా అన్న మాట గుర్తుకొస్తుంది.

ఇంతకీ విషయమేమిటంటే.. తెలుగులోనూ కొంత షూట్ చేసి స్ట్రెయిట్ తెలుగు సినిమాలా బిల్డప్ ఇస్తున్న “చీకటి గదిలో చితక్కొట్టుడు’ అనే ఓ ఆరవ సినిమాలో బూతులు మరీ శృతి మించి పోయాయి. దానిని ఖండిస్తూ రాసే ఇటువంటి ఆరికల్స్ వల్ల సదరు సినిమాకి మరింత ఉచిత ప్రచారం లభిస్తుంది కూడా.

‘చీకటి గదిలో చితకొట్టుడు’ సినిమా ట్రైలర్ చూస్తే.. దీనికి సెన్సార్ ఆమోదం ఎలా లభించిందా అనే అనుమానం కలుగుతుంది. “నెల రోజుల నుంచి పెట్టడం లేదు.. రంధ్రం మూసుకుపోయింది”. “నాకు పెద్దగా ఉంటేనే ఇష్టం”. “రెండు చేతులూ కట్టేసి చేయించుకోవడమంటే ఎంత ఇష్టమో” వంటి బూతు డైలాగులతో ఆ చిత్రం ట్రైలర్ నిండిపోయింది. దాంతో ఈ ట్రైలర్ నెట్ లో చెలరేగిపోతోంది.

ఇటువంటి వాళ్లకు మనం ఎలా బుద్ధి చెప్పాలంటే.. ఈ చిత్రం ఎలాగూ ఓ నెల, రెండు నెలల్లో నెట్ లో ప్రత్యక్షమవుతుంది కాబట్టి అప్పటివరకు వేచి చూసి.. ఈ సినిమాను థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ చేయాలి. అంటే ఈ బూతు చిత్ర రాజాన్ని ధియేటర్ లో చూడచూడకూడదు. అవును.. బూతు పనులు రహస్యంగానే చేయాలి. బూతు సినిమాలు రహస్యంగానే చూడాలి. పబ్లిక్ గా ఎలా చూస్తాం? అసలు ఆ మాటకొస్తే.. ఇటువంటి నేలబారు, నీచమైన సినిమాలు తీసేవాళ్ళను చీకటి గదిలో పెట్టి చితక్కొట్టాలి!!