రాహుల్ తో ‘రచ్చ’ చేయాలనుకుందంట

35
kareena-kapoor-with-Rahul-Gandhi
అభిషేక్ బచ్చన్ ‘రెఫ్యూజీ’ చిత్రంతో తెరంగేట్రం చేసిన కరీనా కపూర్ కి ‘సినిమాల పరంగా హిట్లు కంటే.. ఆమె నడిపిన లవ్ ఎఫైర్స్ ఎక్కువ అన్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, ఫర్దీన్ ఖాన్ వంటి పలువురు హీరోలతోపాటు.. అనేక మంది బడా వ్యాపారవేత్తల కుమారులతోనూ ఈ అమ్మడు లవ్ ఎఫైర్స్ సాగించింది. 
అవన్నీ పక్కన పెడితే.. ఒకప్పుడు ఈ అమ్మడు రాహుల్ గాంధీ తో డేటింగ్ చేయాలనీ భావించిందంట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూ లో కరీనా స్వయంగా ప్రకటించింది. 
‘నేనేమో పూర్తిగా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయిని. రాహుల్ బ్యాక్ గ్రౌండ్ మొత్తం రాజకీయాలే. అందుకే.. మేమిద్దరం డేటింగ్ కి వెళ్తే భలే ఉంటుందని చాలా సార్లు అనిపించింది. అయితే ఇప్పుడు ఈ విషయం ఇలా చెప్పొచ్చో లేదో తెలియడం లేదు’.. అంటూ చెప్పుకొచ్చింది కరీనా కపూర్ ఖాన్!!