లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కష్టమేనా ?

88

టీజర్ , ట్రైలర్ లతో లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఒక్కసారిగా అంచనాలను పెంచేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ . లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించాక ఎన్టీఆర్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది , ముఖ్యమంత్రి అయ్యాక వెన్నుపోటు ఎలా పొడిచారు అన్న కోణంలో ఈ చిత్రం తెరకెక్కడంతో సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యింది . ఇక నేరుగా చంద్రబాబు నాయుడి ని విలన్ గా చూపించడంతో తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు . దాంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కాకుండా చూడాలని కోరుతూ ఎన్నికల సంఘం ని ఆశ్రయించారు .

ఇంకా ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ సినిమా విడుదలకు సుముఖత వ్యక్తం చేయడం కూడా కష్టమే అని తెలుస్తోంది . ఏప్రిల్ 11 న రెండు తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ దాంతో ఇప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది . ఇలాంటి సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని వాపోతున్నారు తెలుగుదేశం నాయకులు , కార్యకర్తలు . మార్చి 22 న సినిమాని రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు వర్మ , ఒకవేళ ఎన్నికల సంఘం రిలీజ్ ని అడ్డుకుంటే యూట్యూబ్ లో రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు వర్మ . లక్ష్మీస్ ఎన్టీఆర్ అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా ? లేదా ? అన్నది ఎన్నికల సంఘం నిర్ణయం మీద ఆధారపడి ఉంది .