50 కోట్ల క్లబ్ లో మజిలీ

92

majili 50 cores అక్కినేని నాగచైతన్య – సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మజిలీ. ఏప్రిల్ 5 న విడుదలైన మజిలీ చిత్రం 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించింది. మజిలీ చిత్రం 50 కోట్ల క్లబ్ లో చేరడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది. నాగచైతన్య కెరీర్ లో మజిలీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

గతకొంత కాలంగా వరుస పరాజయలతో సతమతమవుతున్న నాగచైతన్య కు మజిలీ చిత్రం ఊరట నిచ్చింది. ఇక సమంత అయితే భర్త విజయం కోసం ఏకంగా తిరుమల కు కాలినడకన వెళ్లిన విషయం తెలిసిందే. సమంత మొక్కు అనుకోండి లేదా సినిమా ప్రేక్షకులకు నచ్చడం అనుకోండి మొత్తానికి నాగచైతన్య , సమంత జాయింట్ గా హిట్ కొట్టారు. దానికి తోడు 50 కోట్ల క్లబ్ లో మజిలీ చేరడంతో ఇంకా సంతోషంగా ఉన్నారు చై – సామ్.