శివాజీరాజా పై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగబాబు

66

naga babu shivaji raja

మెగా బ్రదర్ నాగబాబు శివాజీరాజా పై ఆగ్రహం వ్యక్తం చేసాడు . శివాజీరాజా మా అధ్యక్షుడిగా రెండేళ్లు పనిచేసాడు , అయితే ఆశించిన స్థాయిలో పనులు చేయలేకపోయాడు అందుకే మార్పు కోసం నరేష్ కు మద్దతు ప్రకటించాను అంటూ శివాజీరాజా ని లైట్ గా తీసుకున్నాడు నాగబాబు . నరసాపురం ఎన్నికల్లో నాకు ఓటెయ్యొద్దు అని ప్రజలను వేడుకున్నాడు కానీ శివాజీరాజా చెబితే నాకు ఓటేయకుండా పోతారా ? అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు నాగబాబు .

నరేష్ ప్యానల్ కు నాగబాబు మద్దతు ఇవ్వడంతో , తన ఓటమి కి కారణమైన నాగబాబు ఓటమికి నేను కూడా కారణం అవుతా అంటూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నా అంటూ శివాజీరాజా నాగబాబు పై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే . అయితే నర్సాపురం పార్లమెంట్ స్థానంలో తెలుగుదేశం పార్టీ వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నాయి తప్ప జనసేన బలంగా లేదు కాకపోతే కాపుల ఓట్లు ఎక్కువ శాతంలో ఉన్నాయి కాబట్టి నాగబాబు అక్కడ పోటీ చేసాడు . ఇక ఫలితం ఎలా ఉంటుందో మాత్రం మే 23 న రానుంది .