‘పంగనా రనౌత్”

29

ఇకనుంచి కంగనా రనౌత్ ను ‘పంగనా రనౌత్’ అనడం ఖాయం. ఎందుకంటె ఆమె తన ఆటిట్యూడ్ కి యాప్ట్ అయ్యే టైటిల్ తో ఒక సినిమా చేస్తోంది. ఆ సినిమా పేరు ‘పంగా’. పంగా అంటే హిందీలో.. ‘రగడ’ అని చెప్పొచ్చు. సినిమా భాషలో చెప్పాలంటే ‘నాతొ పెట్టుకోకు’ అని కూడా చెప్పొచ్చు. ఎప్పుడూ ఎదో ఒక విషయమై గొడవలు పెట్టుకుంటూ ఉండే కంగనాకు ‘పంగా టైటిల్ భలే సూట్ అవుతుంది. అశ్విని తివారి అయ్యర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతికి విడుదల కానుంది. ‘మణికర్ణిక’తో మంచి విజయం దక్కించుకున్న కంగనా ప్రస్తుతం ‘మెంటల్ హై క్యా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ టైటిల్ కూడా ఆమె మెంటాలిటీకి సూటయ్యేదే కావడం విశేషం!!