చరణ్ మళ్ళీ ఆ డైరెక్టర్ తో ?

48

ramcharan-vamshi

రాంచరణ్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఇంతకుముందు ” ఎవడు ” అనే సూపర్ హిట్ చిత్రం వచ్చింది . 2014లో ఎవడు చిత్రం రాగా మళ్ళీ ఇన్నాళ్లకు మళ్ళీ రాంచరణ్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మరో సినిమా రానున్నట్లు తెలుస్తోంది . అయితే వంశీ పైడిపల్లి మళ్ళీ మెగా ఫోన్ పట్టాలంటే ఇక ఏడాదిన్నర పాటు ఎదురు చూడాల్సిందే .

ఎందుకంటే చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు . జక్కన్న సినిమా అంటే ఆ సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు చరణ్ మరో సినిమా చేయలేడు . అంటే 2020 తర్వాతే అన్నమాట ! అప్పటి వరకు వంశీ పైడిపల్లి చరణ్ కోసం ఎదురు చూడాల్సిందే . ఇక వంశీ పైడిపల్లి విషయానికి వస్తే మహేష్ బాబు తో మహర్షి అనే సినిమా చేస్తున్నాడు . అది వచ్చే నెల 9 న రిలీజ్ కానుంది .