#RRR-అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్

97

RamCharan

రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ . ఇదే సినిమా టైటిల్ గా నిర్ణయించారు జక్కన్న అలియాస్ రాజమౌళి. ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు జక్కన్న .

ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఈ ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర స్వభావాన్ని పోలి ఉండే పాత్ర పోషిస్తున్నాడని తెలిపారు జక్కన్న. ఇక ఈ సినిమాని 2020 జులై 30 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.