మహేష్ సినిమా అంటే ఉపేంద్రకు లెక్కలేదా ?

79

మహేష్ బాబు సినిమాలో కీలక పాత్రలో నటించమని కోరితే నిర్మొహమాటంగా నో చెప్పాడట కన్నడ స్టార్ ఉపేంద్ర . ఎఫ్ 2 తో సంచలన విజయం అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . కాగా ఆ సినిమాలో కీలక పాత్రలో కన్నడ హీరో ఉపేంద్ర అయితే బాగుంటుందని కలిసి కథ చెప్పాడట ! అంతా విన్నాక నేను మీ సినిమా చేయలేను డేట్స్ ఖాళీగా లేవు అని అన్నాడట .

దాంతో షాక్ అయిన అనిల్ రావిపూడి సైలెంట్ గా బెంగుళూర్ నుండి హైదరాబాద్ వచ్చేసాడు . మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు పైగా అనిల్ రావిపూడి కూడా వరుస విజయాలు సాధిస్తున్నాడు అలాంటి సినిమాలో ఉపేంద్ర చేయాల్సి ఉండే కానీ క్యారెక్టర్ దగ్గర సెట్ కాలేదా ? లేక నిజంగానే డేట్స్ సమస్య ఉందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది . డేట్స్ ప్రాబ్లెమ్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఆ పని చేయకుండా ఇప్పుడు డేట్స్ ఖాళీ లేవు అందుకే మహేష్ సినిమా చేయలేకపోతున్నా , కానీ మరోసారి ఛాన్స్ వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను అని అంటున్నాడు ఇదెంటో ట్విస్ట్ .