వెంకీ “మామ” కానున్నాడు!!

68
Venkatesh Daughter Ashritha Marriage Date Fixed
Venkatesh Daughter Ashritha Marriage Date Fixed

F2’ చిత్రంతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని, తన తదుపరి చిత్రంగా ‘వెంకీ మామ’లో నటిస్తున్న విక్టరీ వెంకటేష్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ‘ప్రేమ తో రా.. ప్రేమించుకుందాం రా.. పెళ్లి చేసుకుందాం.. ప్రేమంటే ఇదేరా.. కలిసుందాం రా..’ లాంటి ప్రేమ కథా చిత్రాలకు ఆయన పెట్టింది పేరు. రీల్ లైఫ్‌లో ప్రేమ కథల్ని సుఖాంతం చేసే విక్టరీ వెంకటేష్.. రియల్ లైఫ్‌లో తన కూతురు ప్రేమ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత త్వరలో పెళ్లి పీట‌లెక్క‌బోతుంది. తాజాగా ఆమె నిశ్చితార్థ వేడుక ఫిబ్రవరి 6న చాలా సైలెంట్‌గా జరిపినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆశ్రిత.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పెద్దలు వివాహానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. తాజాగా వెంకటేష్ అన్న సురేష్ బాబు.. సురేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి పెళ్లి ఖాయం చేసుకున్నారన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. అబ్బాయి తండ్రి రఘురామి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి స్నేహితుడు కావడంతో ఈ పెళ్లికి పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. మార్చి 1న అశ్రిత పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇరు కుటుంబాల నుండి ఈ పెళ్లి కబురు అధికారికంగా రావాల్సి వెలువడాల్సి ఉంది!!