టైటిల్ గొడవలో విజయ్ దేవరకొండ సినిమా

25

vijay devarakonda movie title issue

పెళ్లిచూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో తెలుగులో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ . వరుస విజయాలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది ఈ హీరోకు , అయితే తాజాగా ఈ హీరో ఓ కొత్త చిత్రం ప్రకటించాడు , కాగా ఆ సినిమా టైటిల్ గొడవలో ఇరుక్కుంది . ఇంతకీ విజయ్ దేవరకొండ ని ఇబ్బంది పెడుతున్న టైటిల్ ఏంటంటే ……. ” హీరో ” .

ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న చిత్రానికి ” హీరో ” అనే టైటిల్ ని ఖరారు చేసారు . ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు . ఏప్రిల్ 22న ప్రారంభం కానుంది అయితే ఇదే టైటిల్ తో తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది . హీరో టైటిల్ మాది కాబట్టి ఆ టైటిల్ ని మీరు పెట్టుకోవద్దు అని వార్నింగ్ ఇస్తున్నారు తమిళ దర్శక నిర్మాతలు . వాళ్ళు అలా డిమాండ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా …… విజయ్ దేవరకొండ హీరో అనే సినిమాని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ బాషలలో నిర్మించాలని డిసైడ్ కావడమే ! ఈ గొడవకు కారణం . మరి విజయ్ దేవరకొండ ఈ టైటిల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి