విజయ్ దేవరకొండ పై పుకార్లు

46

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ పై పుకార్లు షికారు చేస్తున్నాయి. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన గల్లీ బాయ్ చిత్రాన్ని తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా రీమేక్ చేస్తున్నారని అయితే ఈ విషయం విజయ్ దేవరకొండ చెవిన పడటంతో అవన్నీ పుకార్లు మాత్రమేనని , ఎలాంటి వాస్తవం లేదని ప్రకటించాడు ఈ క్రేజీ హీరో. రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన గల్లీ బాయ్ తెలుగులో రిమేక్ చేస్తే బాగుంటుందని , ఇంకా విజయ్ దేవరకొండ నటిస్తే ఇంకా బాగుంటుందని టాక్ స్ప్రెడ్ కావడంతో ఈ పుకార్లు వచ్చాయి.

అయితే గల్లీ బాయ్ చిత్రం రిమేక్ పట్ల సానుకూలంగా లేడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ హీరో డియర్ కామ్రేడ్ అనే చిత్రం చేస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక డియర్ కామ్రేడ్ చిత్ర విశేషం ఏమంటే తెలుగు , కన్నడ , మలయాళ , తమిళ భాషల్లో అంటే ఏకకాలంలో నాలుగు బాషలలో విడుదల అవుతోంది. మే 31న డియర్ కామ్రేడ్ చిత్రం విడుదల కానుంది.