జ్యోతిర్లింగ దర్శనం పూర్వజన్మ సుకృతం

ఈ క్షేత్రం గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ సమీ పంలో అరేబియా సముద్రతీరాన ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని సౌరాష్ట్ర అని పిలిచే వారు. కృత యుగంలో దక్షప్రజాపతికి 27మంది కన్యలు కలిగారు. వారే అశ్వని, భరణి మొదలగు నక్షత్రా లు. దక్షుడు వారినందరిని సోమునికి ఇచ్చి వివా హం చేశాడు. సోముడు అంటే ప్రసరింప చేసేవాడు అని అర్థం. స+ఉమ=సోమ. ఉమతో కలిసిన వాడు అంటే శివుడు. ఇతని కిరణాలు అమృతమయాలు. విరాట్పురుషుడి అవయ వాలే దేవతలు కనుక మన శ్శక్తే అవయవాలను ప్రసరింపజేస్తుంది. ఈ పురు షుని మనస్థా నీయుడైన చంద్రుని అమృతకిరణాలే దేవతలకు ఆహారం అని పురాణాల ద్వారా తెలు స్తుంది.


నక్షత్రం అంటే నిశింప నిది. సామర్థ్యం నశించకుండా ఉండాలంటే దానికి పరిపూర్ణత్వం సిద్దించాలి. 27 అంకె 2+7=9. ఇది పరిపూర్ణతకు సంకేతం. అందుకే దక్షునికి 27నక్షత్రాలు పుత్రికలు గా కలిగారు. నక్షత్రాలు జ్యోతిర్మండ లాలు కనుక 27నక్షత్రాలు చంద్రునికి భార్యలైనారు. కానీ చంద్రు నికి రోహిణి మీదనే ప్రేమ అధికం. ఇతర భార్యలను నిర్లక్ష్యం చేయ సాగాడు. రోహిణి అంటే మొలిచేది అని అర్థం. సోముడు ఓషధులకు అధిపతి కనుక మొలకెత్తించే శక్తికి అధిపతి అయిన రోహిణి అంటే ప్రేమ. దీన్ని మిగతా భార్యలు సహించలేక తండ్రి దగ్గర మొరపెట్టుకున్నారు. దక్షుడు సోమునికి నచ్చ చెప్పినా మారలేదు. కూతుళ్లు మళ్లీ ఫిర్యాదు చేశారు. దక్షుడు కోపంతో క్షయవ్యాధి పీడితుడవు కమ్మని శపించాడు. శాపం తో సోముడు మంచం పట్టాడు. మళ్లీ కూతుర్లు తండ్రిదగ్గర వాపోయారు. ఇది గమనించిన దేవతలు ఆలోచించి బ్రహ్మ దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు.

బ్రహ్మ సోమునితో సోమా! సౌరాష్ట్ర దేశంలో ప్రభాస మనే క్షేత్రం ఉంది. అక్కడ ఉమాసహితుడైన పరమే శ్వరుడు సోమశక్తితో జ్యోతిర్లింగరూపంలో ప్రకాశిస్తు న్నాడు. నీవు ఆయన్ని ఆరాధించు. రాష్ట్రము అంటే శరీరం. సౌరాష్ట్రము అంటే యోగ్యమైన శరీరం. ప్రభాసము అంటే ప్రశస్తమైంది. ఆయనను నీవు మృత్యుంజయ జపంతో ఉపాసిస్తే నీకు శుభం కలిగి సౌమత్వం నీకు సిద్దిస్తుంది. దీంతో సోముడు ప్రభా సక్షేత్రంలో పర్ణశాల నిర్మించుకొని తపస్సు ప్రారం భించాడు. తపస్సుకు మెచ్చి సోమనాథుడు సోముని ఎదుట ప్రత్యక్షమయ్యాడు.ఈ క్షేత్రం కర్నూలు జిల్లా లో ఉంది. ఇది జ్యోతిర్లింగమే కాదు శక్తిపీఠం కూడా. కాశీలో మరణిస్తే ముక్తి, అరుణా చలాన్ని స్మరిస్తే ముక్తి, శ్రీశైలశిఖర దర్శనం చేస్తే ఇక జన్మే లేదు.

పార్వతీపరమేశ్వరులు గణపతి కుమార స్వాములకు వివాహం చేయాలని సంకల్పించారు. దానికి ముందు ఆధిపత్యం ఎవరికి ఇవ్వాలన్న దాని మీదచర్చ జరిగింది. నాకంటే నాకు అన్నారు ఇద్దరూ. భూమి మీద గల 3కోట్ల తీర్థాలలో స్నానం చేస్తూ భూప్రదక్షణం పూర్తి చేసుకొని ముందుగా వచ్చినవారికి ఆధిపత్యంతోపాటు వివాహం చేస్తామని మాతాపితలు నిర్ణయించారు. కుమారస్వామి నెమలి వాహనంపై దూసుకెళ్లాడు. గజవదనుడు అక్కడేనిలబడి నిదానం గా తల్లిదండ్రులకు ముమ్మార్లు ప్రదక్షణ నమస్కారం చేశాడు. కుమారస్వామి స్నానం చేసిన ప్రతిచోట గజా ననుడు స్నానం ముగించుకొని పోతున్నట్లు కనిపిం చింది.

కష్టపడి రొప్పుకుంటూ వచ్చిన కుమారస్వామికి ప్రశాంతంగా కూర్చున్న గణపతి కన్పించాడు. ఆధిప త్యం గణపతికి ఇవ్వడమే కాకుండా సిద్దిబుద్దులతో గణపతికి వివాహం జరిపించారు. కుమార స్వామి ఆగ్రహించి క్రౌంచపర్వతంపై మకాంపెట్టాడు. పార్వతీ పరమేశ్వరులు నారదుని రాయబారిగా పంపారు. అయినా కుమారస్వామి వినలేదు. దీంతో పార్వతీ మాత భ్రమరరూపిణిగా భ్రమరనాదం చేస్తూ క్రౌంచ పర్వతానికి వచ్చేసింది.కుమారస్వామి కోసం వచ్చిన భ్రమ రాంబికా మల్లికార్జునులు ఒకరు నాదరూపంగా, మరొకరు జ్యోతిరూపంగా అక్కడే స్థిరపడ్డారు.

"data-width="100%" data-numposts="5">