కండరాలకు శక్తినిచ్చే పోషకాలు


మన గుండె మన పిడికిలంత అని అందరికీ తెలుసు. అటువంటి గుండె సైజు పెరిగితే అనేక ఇబ్బందులు వస్తాయి. గుండె పెరగటం అంటే గుండె సాగిపోయి, బలహీనపడటం అని అర్ధం చేసుకోవాలి. గుండెపెరిగింది అంటే దాని పని తీరు అపసవ్యంగా మారుతుంది. గుండె సక్రమంగా పనిచేయవలసిన రీతిలో పనిచేయకుండా అస్తవ్యస్తంగా మారుతుంది. గుండె సక్రమంగా, పనిచేయవలసిన రీతిలో పనిచేయకుండా అస్తవ్యస్తంగా పనిచేస్తుంది. వైద్యులు దీనిని హార్ట్‌ ఫెయిల్యూర్‌గా పిలుస్తారు. అంటే సరిగా పనిచేయలేకపోవటం అని అర్ధం. ఇది ఒక రకంగా గుండె కండరాలవాపు అని చెప్పుకోవచ్చు. గుండె కండరాల వాపును కార్టియోమయోపధి అంటారు. గుండె పెరగటం కండరాల వాపులో భాగమే, కండరాలవాపులో భాగమే, కండరాలు వాస్తే సైజు పెరిగినట్లే కదా! గుండెపోటు వచ్చి చికిత్స ద్వారా కోలుకున్న వారిలో గుండె పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఊపిరితిత్తులు గట్టిపడటం తదితర శ్వాసకోశ సంబంధ వ్యాధుల వలన కూడా గుండె పెరగవచ్చు. మూత్రపిండాలకు, గుండెకు అవినాభావ సంబంధం ఉంటుంది గనుక మూత్రపిండాలు కూడా దెబ్బతినవచ్చు. ఆయాసం అనేది గుండె పెరుగుదలయొక్క ప్రత్యక్ష ప్రభావం. ప్రత్యేకించి ఆయాసం రాత్రి పూట ఎక్కువ అవ్ఞతుంది. పిల్లికూతలు ఉంటాయి. వెల్లకిలా పడుకోవటం అసాధ్యం. లేచి కూర్చుంటే ఉపశమనం. కొంతమందిలో ఊపిరితిత్తులలో నీరుచేరి గురగురశబ్దం వస్తుంది. శరీరభాగాలకు నీరుచేరి ఉబ్బిపోవటం, మూత్రం బంధింపబడితే ఖచ్చితంగా గుండె పెరిగినట్లు నిర్ధారించుకోవచ్చు.

గుండె పెరగటం అనేది దీర్ఘకాలిక వ్యాధి, పెరిగిన గుండె తిరిగి పూర్వస్థితికి రావటం చాలా కష్టం. అందువలన ఇటువంటి స్థితి వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మూత్రపిండాలపై ఒత్తిడి పెంచరాదు. శరీరంలోకి నీరు చేరకుండా చూసుకోవాలి. పూర్తి విశ్రాంతి అవసరం. బరువ్ఞ పనులు, శ్రమతో కూడిన పనులు చేయరాదు. ధూమపానం, మద్యపానం మానివేయాలి. స్థూలకాయులు బరువ్ఞ తగ్గించుకోవాలి. ఉప్పుమూలంగా శరీరంలోకీ నీరు చేరుతుంది. అందువలన ఉప్పులేని చప్పిడి అన్నం తప్పనిసరి. గుండె బలహీనపడటం అంటే రోగనిరోధకశక్తి తగ్గినట్లు అని అర్ధం.

అందువలన ఫ్రీరాడికల్స్‌ విజృంభించి, ఇతర శరీర భాగాలను వ్యాధిగ్రస్థం చేస్తాయి. అందువలన ఈ ఫ్రీరాడికల్స్‌ను నిలువరించి, రోగనిరోధక శక్తిని పెంచే జీవ రక్షకాలు ఎక్కువగా ఉండే పోషకాలను ఎక్కువగా తీసుకోవాలి. వైద్యుని సలహా మేరకు గుండె కండరాలకు శక్తినిచ్చే అదనపు పోషకాలను పరిమితంగా తీసుకోవచ్చు. గుండె కండరాలకు, మూత్రపిండాలకు శక్తినిచ్చే ఆహార పదార్థాలను వైద్యుల సలహా మేరకు ఎంపిక చేసుకుని తీసుకోవాలి. ఆ క్రమంలో మూత్ర విసర్జన సాఫీీగా జరగటానికి ఉపకరించే ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. శరీర భాగాలకు నీరు చేరినప్పుడు, ఆ నీటిని బయటకు పంపేందుకు అల్లోపతి వైద్యులు లాసిక్స్‌ అనే మందును బిళ్లల రూపంలోగాని, ఇంజక్షన్‌ రూపంలోగాని ఇస్తుంటారు. ఈ మందు ప్రభావం తక్షణమే ఉంటుంది.

ఒంట్లోని నీరంతా కొన్ని గంటలలోనే మూత్ర విసర్జన ద్వారా బయటకు వెళుతుంది. అయితే, ఇది అంత క్షేమం కాదు. ఒక్కొక్కసారి నీరసం వస్తుంది. అంతేకాకుండా, మూత్రపిండాలు శాశ్వతంగా పనిచేయటం మానివేస్తాయి. గుండె వ్యాకోచం అంటే గుండె కండరాలు బలహీనపడం, కండరాలు సాగినందువలన గుండె సంకోచ, వ్యాకోచాలలో తేడా ఉంటుంది. పర్యవసానంగా గుండె ఎంత కష్టపడ్డా, ఎంత త్వరితంగా కొట్టుకున్నా మలిన రక్తాన్ని స్వీకరించటంలోను, శుద్ధి చేసిన రక్తాన్ని బయటకు పంపటంలోను తేడా ఉంటుంది. అంటే రక్తప్రసరణ లోపిస్తుంది. అన్ని శరీర భాగాలకు రక్తప్రసరణ సరిగా ఉండదు.

ఒక్కమాటలో చెప్పాలంటే గుండె సామర్థ్యం తగ్గిపోతుంది. దీనినే గుండె బలంగా కొట్టుకోవటంలో తేడా లేక ఇంజెక్షన్‌ ఫ్రాక్షన్‌ అంటారు. ఆరోగ్యవంతులలో ఈ ఇంజెక్షన్‌ ఫ్రాక్షన్‌ కనీసం 60 నుండి 80 శాతం ఉండాలి. గుండె పెరగటం వలన ఈ సామర్ధ్యం 20 శాతానికి కూడా తగ్గిపోవచ్చు. ఈ సామర్ధ్యం 30 శాతానికి తగ్గితే గుండె మార్పిడి చేయక తప్పదు. ఈ సమస్య నుండి గట్టెక్కాలంటే వైద్య చికిత్స, ఆహారచికిత్సతో బాటు కో ఎంజైము క్యు – 10 (కోక్యు10) అనే పోషకాన్ని అదనంగా, అనివార్యంగా తీసుకోవటం ఎంతో అవసరమని వైద్య విజ్ఞానం చెబుతున్నది.

"data-width="100%" data-numposts="5">