కొలెస్టరాల్‌-విశ్లేషణ

మన రక్తంలో వివిధ లిపిడ్స్‌లో ‘ఎల్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ను చెడు కొలెస్టరాల్‌గానూ, ‘హెచ్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ను మంచి కొలెస్టరాల్‌ గానూ వర్ణిస్తారు. రక్తంలో హెచ్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ ఎంత ఎక్కువ ఉంటే, ఆ వ్యక్తికి కరొనరీ గుండెజబ్బు (గుండెపోటు, యాంజైనా) సోకే అవకాశం అంత తక్కువగా ఉంటుంది. ఈ మంచి కొలెస్ట రాల్‌, ధమనుల లోపలి పొరలలో ఎక్కువగా ఉన్న కొలెస్టరాల్‌ను కాలేయానికి తీసుకుపోయి అక్కడినుండి శరీరం బయటికి విసర్జించబడేలా చేస్తుంది. ఈ విధంగా ధనుల గోడల్లో గార (ప్లేక్‌) ఏర్పడకుండా తోడ్పడుతుంది. హెచ్‌డిఎల్‌ కొలెస్టరాల రక్తంలో గడ్డకట్టకుండా, ఎల్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ ఆక్సీకరణకు వ్యతిరేకంగా పని చేసి శరీరానికి, గుండెకు రక్షణ కల్పిస్తుంది. చెడ్డ కొలెస్టరాల్‌ తక్కువగా ఉండటం కంటే, మంచి కొలెస్టరాల్‌ ఎక్కువగా ఉండటమే మరింత మేలు కలిగిస్తుందని వైద్య శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.

ఫ్రామింగ్‌హామ్‌ అధ్యయనంలో హెచ్‌డిఎల్‌ 40 మిల్లీగ్రాము లకంటే తక్కువ ఉన్నవారిలో (వారిలో మొత్తం కొలెస్టరాల్‌ ఎంత ఉన్నా) గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువని వెల్లడైంది. మంచి కొలెస్టరాల్‌ స్థాయి తక్కువ ఉన్నవారిలో గుండెపోటు, పక్షవాతం, మూడు కరొనరీ ధమనుల వ్యాధి, బైపాస్‌ శస్త్ర చికిత్స అవసరం కావడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.హెచ్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తారు. నేషనల్‌ కొలెస్టరాల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం మార్గదర్శక సూత్రాల ప్రకారం హెచ్‌డిఎల్‌ 40 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండకూడదు. మెటబాలిక్‌ సిండ్రోమ్‌లో ట్రై గ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం, మధుమేహం, అధిక రక్తపోటు, ఉదర స్థూలకాయాలతోపాటు మంచి కొలెస్టరాల్‌ తక్కువగా ఉండటం ఒక ప్రధాన అంశం. ఈ సిండ్రోం లక్షణాలు ఉన్నవారిలో మధు మేహం, కరొనరీ గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెచ్‌డిఎల్‌ కొలెస్టరాల్‌ భారతీయ పురుషుల్లో 40 మిల్లీగ్రాములకంటే ఎక్కువగానూ, స్త్రీలలో 50 మిల్లీగ్రాముల కంఏట ఎక్కువగానూ ఉండాలి.

సుమారుగా భారతీయ పురుషుల్లో సగంమందికి, భారతీయ స్త్రీలలో 2/3వ వంతు వారికి మంచి కొలెస్టరాల్‌ ఉండవలసిన దానికంటే తక్కువ స్థాయిలో ఉంటున్నాయని గణాంకాలు తెలుపుతున్నాయి. మొత్తం కొలెస్టరాల్‌, హెచ్‌డిఎల్‌ నిష్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే కరొనరీ గుండె జబ్బు అంత తీవ్రంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ నిష్పత్తి 3 కంటే తక్కువ ఉండాలి. 4 ఉంటే ఫరవాలేదు. ఈ నిష్పత్తి 5 కంటే ఎక్కువ ఉంటే, ఆహార నియమాలు మొదలైన వాటిని వైద్య నిపుణుని సలహాతో పాటించాలి. భారతీయుల్లో టోటల్‌ కొలెస్టరాల్‌,ఎల్‌.డి.ఎల్‌ కొలెస్ట రాల్‌ మరింత ఎక్కువగా లేక పోయినా, మంచి కొలెస్టరాల్‌ స్థాయి తక్కువగా ఉండటం శోచ నీయం. కరొనరీ గుండె జబ్బుల నివారణకు చెడ్డ కొలెస్టరాల్‌ ఎక్కు వగా ఉంటే దాన్ని తగ్గించడం ఎంత ముఖ్యమో, గుండెకు మేలు చేకూర్చే హెచ్‌.డి.ఎల్‌ కొలెస్టరాల్‌ను పెంచడం అంతే ముఖ్యం.

హెచ్‌.డి.ఎల్‌ పెద్దసైజు అణువులు మన రక్తంలో తిరగాడుతూ, పనిమనిషి చెత్తను తొలగించినట్లు చెడ్డ కొలెస్టరాల్‌ను తొలగిస్తూ ఉంటుంది.రక్తంలో హెచ్‌.డి.ఎల్‌ కొలెస్టరాల్‌ స్థాయి తక్కువగా ఉండటానికి కారణాలు : 1) వంశపారంపర్యత (40 నుంచి 60 శాతం), 2) రోజువారీ శరీర వ్యాయామం లేకపోవడం 3) రక్తంలో ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం 4) పొగ తాగడం 5) కృత్రిమ పిండి పదార్థాలు, ట్రాన్స్‌ఫాట్స్‌ (ఉదాహరణకు వేపుడు తినుబండారాలు), 6) అధిక రక్తపోటుకు వాడే కొన్ని మందులు (మూత్ర కారకాలు, బీటాబ్లాకర్స్‌)రక్తంలో మంచి కొలెస్టరాల్‌ పెరగాలంటే రోజువారీ వ్యాయామం (నడక, ఈత మొదలైనవి), స్థూలకాయులు బరువు తగ్గడం, ఆహారంలో మోనో అన్‌శాచ్యురేటెడ్‌ క్రొవ్వు పదార్థాలను తీసుకోవడం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్వుకగా ఉండే చేపలను తినడం, ధూమపానం మానివేయడం తదితర చర్యలు చేపట్టాలి. వారానికి 12నుంచి 16 మైళ్లు నడవటం లేదా పరుగెత్తడం, లేదా వారానికి 1200 నుంచి 1400 కేలరీల శక్తిని ఖర్చు చేయడం వల్ల 10 నెలల్లో మంచి కొలెస్టరాల్‌ 10 శాతం పెరుగుతుంది.

ఆహారంలో సాచ్యురేటెడ్‌ కొవ్వు పదార్థాలను (నెయ్యి, కొబ్బరి, పామాయిల్‌, వెన్న, మీగడ వంటివి) తగ్గించి మోనో అన్‌సాచ్యు రటెడ్‌ కొవ్వు పదార్థాలను (ఉదాహరణకు ఆలివ్‌ నూనె, కనోలా నూనె, జీడిపప్పు, బఠాణీల వంటి నట్స్‌, బక్కపలుచని మాంస పదార్థాలు) తీసుకుంటే మంచి కొలెస్టరాల్‌ పెరుగుతుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపలను తినటం వల్ల మంచి కొలెస్టరాల్‌ పెరుగుతుంది. శాకాహారులు వీటిని కేప్సూల్‌ రూపం లో తీసుకోవచ్చు. మంచి కొలెస్టరాల్‌ను పెంచే ఔషధాల్లో స్టాటిన్స్‌ (ఎటార్వోస్టాటిన్‌, రోజువాస్టాటిన్‌ మొదలైనవి), ఫైబ్రేట్స్‌ ఉపయోగిస్తాయి కాని నియాసిన్‌ చాలా బాగా ఉపకరించే ఔషధం. నియాసిన్‌ 2 గ్రాముల మోతాదులో వాడితే మంచి కొలెస్టరాల్‌ 40 శాతం పెరుగుతుంది. వైద్య నిపుణుడు లేదా కార్డియాలజిస్ట్‌ సలహా ప్రకారం ఆహార నియమాలను పాటిస్తూ ఈ మందులను వాడాలి.

"data-width="100%" data-numposts="5">