గుండె ఆగిపోతే ఏం చేయాలి?

ఠాత్తుగా గుండె ఆగిపోయినప్పుడు మనిషిని బ్రతికించ డానికి చేసే ప్రక్రియను కార్డియో పల్మనరీ రిసస్సిటేషన్‌ (సిపిఆర్‌) అంటారు. తెలగులో దీనిని హృదయ శ్వాస పునరుద్ధారణ అనవచ్చు. సిపిఆర్‌ చేయడానికి ప్రత్యేక విద్యార్హత లేమీ అక్కరలేదు. అందరూ నేర్చుకోవచ్చు. ప్రమాదానికి గురైన వ్యక్తిని కాపాడటానికి ఆ మనిషి పక్కన ఉన్నవారు సిపిఆర్‌ చేయవచ్చు. గుండె హఠాత్తుగా ఆగిపో యినట్లు తెలుసుకోవ డానికి ఈ కింది సూచనలు గమనిస్తే చాలు. అంతవరకూ స్పృహలోనే ఉన్న మనిషి హఠాత్తుగా స్పృహకోల్పోతే గుండె ఆగిపోయినట్లు అనుమానించాలి.

నాడీ స్పందన కోల్పోవడం: నాడిని శరీరంలోని వివిధ భాగాల్లో పరీక్ష చేయ వచ్చు. కాని సామాన్య ప్రజానీకానికి వీలయినది ఎడమ చేయి మణికట్టు దగ్గర బొటనవేలు వైపు ఉన్న నాడి. దీనిని పరీక్షించవచ్చు.

సిపిఆర్‌లోని ముఖ్యాంశాలు స్థితి : 
వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్టాలి. వీలుంటే గట్టిగా ఉండే మంచంమీద కాని, నేల మీద కాని పడుకోబెట్టాలి. లేదా వీపు కింద బోర్డును దూర్చ వచ్చు. ప్రత్యేకంగా వీట ికోసం కాలాన్ని వృధా చేయకూడదు. ఈ సమయంలో ప్రతీ సెకనూ విలువైనదే.

శ్వాస ద్వారాల శుభ్రత :
 ముక్కు, నోరు, గొంతులో ఏమైనా అడ్డు ఉంటే తీసివేయాలి. కృత్రిమ శ్వాస, గుండె పునరుద్ధరణ ఈ రెండు ప్రక్రియలు ఒక్కసారే జరపాలి. కృత్రిమ శ్వాస ఉద్దేశ్యం ఊపిరితిత్తుల్ని గాలితో నింపడమూ, తద్వారా గాలిలోని ప్రాణవాయువు రక్తంలో లీనమవ డమూ. ప్రాణవాయువుతో నిండిన రక్త ప్రసరణ లేకపోతే మెదడు కణాలు జీవించడం కష్టం. ప్రమాదానికి గురైన వ్యక్తి నోటి ద్వారా శ్వాస నందించవచ్చు. ఇది చేసేప్పుడు వ్యక్తి ముక్కును మూసి ఉంచాలి. రెండవ విధానంలో నోటి ద్వారా ప్రమాదానికి గురైన వ్యక్తి ముక్కుద్వారా శ్వాసనం దించవచ్చు. ఇది చేసేప్పుడు వ్యక్తి నోటిని మూసి ఉంచాలి. గుండె వత్తిడి గుండె, రొమ్ము ఎముకకు, వెన్నెముకకు మధ్య ఛాతీలో ఉంటుంది. అందుకే రొమ్ము ఎముక కింది భాగం మీద ఒక అరచేతి మీద ఇంకొక అరచేతిని ఆనించి గట్టిగా వెన్నెముక వైపు వత్తితే గుండెకు వత్తిడి కలిగి, గుండెలో ఉన్న రక్తం శరీరానికి, ముఖ్యంగా మెదడుకు ప్రసరణమవుతుంది. ఈ ప్రక్రియను నిముషానికి 60 నుంచి 70 సార్లు చేయాలి. గుండె వత్తిడి, కృత్రిమ శ్వాస ప్రక్రి యలు విడివిడిగా వివరించినా, రెండూ ఒకే సమ యంలో చేయాలి. వ్యక్తి కోల్పోయిన నాడి మళ్లీ అందడం ద్వారా సిపిఆర్‌ ప్రక్రియ విజయవంత మైందని తెలుసుకోవచ్చు.

"data-width="100%" data-numposts="5">