చలికాలంలో చ‌ర్మ సౌంద‌ర్యం

లికాలంలో చర్మంలో నూనె ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో చర్మం పొడిబారి అందవిహీనంగా, ముడతలుగా, పొలుసులుగా కనిపిస్తుంది. కనుక వారానికోసారి ఎక్స్‌ఫొలియేట్‌ చేసుకోవాలి. దీనివల్ల చర్మంలో పేరుకున్న మృతకణాలన్నీ తొలగిపోతాయి నీటిలో రెండు చుక్కలు బాదం నూనె వేసుకుని స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. సబ్బులు కూడా ఏవి పడితే అవి వాడకూడదు. శీతాకాలానికి అనువైనవే ఎంచుకోవాలి. పెసలను పిండి కొట్టించి దాంతో స్నానం చేస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. చల్లటి వాతావరణంలో బయట విహరించటానికి ఎంతో మంది ఉత్సాహం చూపిస్తారు. కానీ, వాతావరణంలో ఉండే అతి చల్లదనం చర్మానికి హాని చేస్తుందని మాత్రం మరువకూడదు.

ముఖ్యంగా చలికాలంలో చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏ కాలంలోనైనా చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో నీటి పరిమాణం తగినంత తప్పనిసరిగా ఉండాల్సిందే. చర్మకణాలు నిరంతరం వాటి పని అవి చేసుకుపోవాలంటే చర్మానికి నీరు ఎంతో అవసరం. కనుక సాధ్యమైనంత నీరు తాగుతూ ఉండాలి. దీనివల్ల చర్మంలో తేమ నిలకడగా ఉంటుంది. ఎక్కువగా నీరు తాగడం కష్టమనుకుంటే పండ్లరసాలు, హెర్బల్‌ టీ కూడా తాగవచ్చు. చర్మ తత్వానికి సరిపడే మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌ను వాడాలి. లేకుంటే చల్లదనం కారణంగా చర్మం పొడిబారుతుంది. దాంతో చర్మం సున్నితత్వం దెబ్బతిని కాంతి హీనంగా మారుతుంది. జింక్‌ ఆక్సైడ్‌, విటమిన్‌ ఈ ఉన్న మాయిశ్చరైజర్‌ క్రీమును ఎంచుకుంటే మంచిది.

సన్‌స్క్రీన్‌ లోషన్‌ అన్నికాలాలో చర్మపరిరక్షణకు వాడుకోవాలి. ఎస్‌పిఎఫ్‌ 15 ఉన్న సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడుకోవడం వల్ల హానికారక సూర్యకిరణాల నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా ఈ కాలానికి తగిన విధంగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. విటమిన్‌ సి, బి, ఈ, జింక్‌, మెగ్నీషియం ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ కాలంలో చాలా రకాల పండ్లు మార్కెట్లోకి వస్తాయి. ఆహారంలో పండ్లను తప్పని సరిగా ఒక భాగం చేసుకోవాలి. ఈ కాలంలో చుండ్రు కూడా పెరుగుతుంది. షాంపూలు కేశాలకు పోషణ ఇచ్చేవిగా ఉండాలి. పాదాల పగుళ్లు కూడా వేధిస్తాయి. నాణ్యమైన సాక్స్‌లు, షూ వేసుకోవడం వల్ల పాదాలను పగుళ్ల నుంచి కాపాడుకోవచ్చు.

రాత్రి నిద్రపోయే ముందు పెట్రోలియం జెల్లీ రాసుకుంటే మంచిది. అన్నింటికంటే శారీరక వ్యాయామం ద్వారా చర్మాన్ని మరింత ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చు.వ్యాయామం కారణంగా చర్మంలోని మలినాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాయి. పైగా ఈ కాలంలో వ్యాయామం చేయడం వల్ల శరీరం ఉత్సాహవంతంగా ఉంటుంది. ముఖ్యంగా తడి వస్త్రాలను శరీరంపై ఎక్కువ సేపు ఉండకుండా చూసుకోవాలి. దాహం ఎక్కువగా కాకపోవడం వల్ల నీళ్లు ఎక్కువగా తాగాలనిపించదు. దీని వల్ల చర్మంలో తేమ శాతం తగ్గిపోయి పొడిబారుతుంది. దాహం ఉన్నా లేకపోయినా విధిగా నీళ్లు తాగాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను, పండ్ల రసాలను తీసుకోవాలి. బయటికి వెళ్లే ముందు తప్పనిసరిగా మాయిశ్చ రైజర్‌ రాసుకోవాలి.

బయ టికి వెళ్లి వచ్చిన తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేసి తిరిగి మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి. మసాజ్‌ ఆయిల్‌, గంధంపొడి, రోజ్‌వాటర్‌, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. చర్మం పగిలిపోయినట్లుగా ఉండేవారు స్నానానికి సబ్బుకు బదులుగా సున్నిపిండిని ఉపయోగించండం మంచిది. స్నానం చేసిన తరువాత వెనిగర్‌ కలిపిన నీళ్లను శరీరంపై పోసుకుంటే పగుళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు. గ్లిజరిన్‌లో రోజ్‌వాటర్‌, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని చేతులు, కాళ్లకు అప్లై చేయాలి. తరువాత చల్లనీ నీటితో కడిగేయాలి.

పెరుగు, పసుపు, తేనె కలిపి సున్నితంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీనిని ముఖంపై మర్దనా చేసి పదిహేను నిమిషాల పాటు ఉంచి, ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. అరటిపండు, బొప్పాయి, యాపిల్‌ పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి తరువాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. నల్లగా, కరుకుగా ఉన్న మోచేతులు ఈ చలికాలంలో మరింత పొడిబారతాయి. నిమ్మకాయ సగం ముక్కను తీసుకుని మోచేతికి బాగా రుద్దాలి. ఆరిన తరువాత కడిగేస్తే చర్మం కాంతులీనుతుంది. పెరుగు, దోసకాయ రసం కలిపి ముఖం తుడిచేస్తే చర్మం శుభ్రపడుతుంది.

"data-width="100%" data-numposts="5">