మజిలీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

90

majili first review

అక్కినేని నాగచైతన్య – సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో నటించిన చిత్రం మజిలీ . ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని నిన్న అక్కినేని కుటుంబం చూసింది . అందులో నాగార్జున మేనల్లుడు హీరో సుశాంత్ కూడా ఉన్నాడు . ఇంకేముంది మజిలీ చిత్రం పై తన రివ్యూ ఇచ్చేసాడు సుశాంత్ .

నాగచైతన్య – సమంత ల నటనకు ఫిదా అవ్వాల్సిందే అంటూ ఇద్దరు కూడా అద్భుతంగా నటించారని పేర్కొన్నాడు సుశాంత్ . అంతేకాదు దర్శకులు శివ నిర్వాణ మజిలీని అద్భుతంగా తీర్చిదిద్దాడని అలాగే గోపిసుందర్ అందించిన పాటలు బాగున్నాయి , ఇక తమన్ నేపథ్య సంగీతం తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్లాడని ట్వీట్ చేసాడు సుశాంత్ . మొత్తానికి అక్కినేని హీరో నటించిన మజిలీ ఫస్ట్ రివ్యూ ని ఆ కుటుంబానికి చెందిన హీరో ఇవ్వడం విశేషం .