మజిలీ రివ్యూ

405

majili-review

నటీనటులు : నాగచైతన్య , సమంత , దివ్యంకా కౌశిక్
సంగీతం : గోపిసుందర్
నేపథ్య సంగీతం : తమన్
నిర్మాతలు : సాహు గారపాటి , హరీష్ పెద్ది
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 5 ఏప్రిల్ 2019

అక్కినేని నాగచైతన్య గతకొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు . ఇక సమంత అయితే వరుస విజయాలతో దూసుకుపోతోంది . ఈ ఇద్దరూ కలిసి నటించిన మజిలీ ఈరోజు రిలీజ్ అయ్యింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? చూద్దామా !

స్టోరీ :

క్రికెట్ ప్లేయర్ అయిన పూర్ణ ( అక్కినేని నాగచైతన్య ) కు అన్షు (దివ్యంకా కౌశిక్ ) పరిచయం అవుతుంది . ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది , అయితే పూర్ణ – అన్షు ల ప్రేమ వ్యవహారం నచ్చని పెద్దలు వాళ్ళని విడదీస్తారు . దాంతో పూర్ణ డిప్రెషన్ కి లోనౌతాడు . అయితే పెద్దల ఒత్తిడితో శ్రావణి ( సమంత ) ని పెళ్లి చేసుకుంటాడు పూర్ణ . ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకొని మరో పెళ్లి చేసుకున్న పూర్ణ – శ్రావణి ల సంసారం ఎలా సాగింది ? చివరకు ఏమైంది అన్న విషయం తెలియాలంటే సినిమా చూడల్సిందే .

హైలెట్స్ :

అక్కినేని నాగచైతన్య
సమంత
పాటలు
నేపథ్య సంగీతం
విజువల్స్
సెంటిమెంట్

డ్రా బ్యాక్స్ :

కొన్ని సన్నివేశాలు
స్లో నెరేషన్

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

అక్కినేని నాగచైతన్య పూర్ణ పాత్రకు పూర్తి న్యాయం చేసాడు . టీనేజ్ కుర్రాడిలా , డిప్రెషన్ కి లోనైనా యువకుడిగా విభిన్న పార్శ్వాలను స్పృశించి మెప్పించాడు చైతూ . సమంత కు మరోసారి అద్భుత నటన ని ప్రదర్శించే పాత్ర లభించింది . సహజంగానే సమంత అద్భుత నటి కావడంతో అవలీలగా మెప్పించింది శ్రావణి పాత్రని . కొత్త అమ్మాయి దివ్యంకా కౌశిక్ గ్లామర్ తో అలరించింది . ఇక మిగిలిన పాత్రల్లో పోసాని , రావు రమేష్ లు తమ పాత్రలతో మరో మెట్టు ఎక్కించారు మజిలీ చిత్రాన్ని .

టెక్నికల్ గా :

విష్ణు శర్మ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి . మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ వినసొంపైన పాటలను అందించాడు , అయితే నేపథ్య సంగీతం మాత్రం తమన్ అందించాడు . తమన్ అందించిన రీ రికార్డింగ్ ఈ చిత్రానికి ఆయువు పట్టులా నిలిచింది . షైన్ స్క్రీన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు శివ విషయానికి వస్తే …….. మజిలీ ని హృదయానికి హత్తుకునేలా తీసాడు , అయితే సెకండాఫ్ లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది .

ఫైనల్ గా :

తప్పకుండా మజిలీ ని ఓసారి చూడొచ్చు