‘పద్మావత్’ బ్యాన్.. సుప్రీంకోర్టుకు నిర్మాతలు..

న్యూఢిల్లీ : వివాదాలతో మొదలైన ‘పద్మావత్‌’ చిత్రం ఇంకా వివాదాల్లోనే సాగుతుంది. చిత్ర నిర్మాతలు ఎంత ప్రయత్నించినా విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ రావట్లేదు. ‘పద్మావత్’ విడుదల వ్యవహారం సెన్సార్ బోర్డ్ దగ్గరే చూసుకోవాలంటూ అప్పట్లో సుప్రీం తెలిపిన విషయం తెలిసిందే. సెన్సార్‌ బోర్డు ఓకే చెప్పినా విడుదల విషయం మాత్రం ఎటూ తెలట్లేదు. జనవరి 25 విడుదల కానున్న ఈ చిత్రం ఇంకా వివాదాల్లోనే మగ్గుతుంది. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుంటామంటున్నారు ఆందోళనకారులు

ఇదిలా ఉంటే ఇప్పటికే రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాలలో పద్మావత్ విడుదలను నిలిపివేస్తున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇక చిత్ర నిర్మాతలు చేసేది లేక మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించాలని డిసైడ్‌ అయ్యారు. ఎన్నో కష్టాలనోర్చి రూపొందిచిన ‘పద్మావత్‌’ చిత్రానికి న్యాయం చేయాలంటే.. నిర్మాతలు సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. రేపు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధానపాత్రలలో సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

"data-width="100%" data-numposts="5">