టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తేనే.. ఎన్టీఆర్‌ ఆత్మకు శాంతి

అంతరించిపోవటం కంటే.. పార్టీని విలీనం చేయడమే ఉత్తమం అంటూ సీనియర్‌ టీడీపీ నేత మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అదీ ఎన్టీఆర్‌ వర్ధంతి రోజున తెలుగుదేశం పార్టీని విలీనం చేయాలనటం వెనక కారణాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ టీడీపీ అంతరించిపోతుంది. టీడీపీకి గౌరవం దక్కాలంటే పార్టీని టీఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేయాలని చంద్రబాబుకు మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం మోత్కుపల్లి ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఘాట్‌కు చంద్రబాబు వచ్చి నివాళులర్పించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ రోజు రోజుకు అంతరించిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు వింటుంటే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూరాలంటే టీడీపీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలన్నారు.

దీనిపై ఆ పార్టీలో కలకలం రేపింది. మోత్కుపల్లి వ్యాఖ్యలు వ్యక్తిగతం అంటూ కొట్టిపారేశారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ. నిన్నటి వరకు మాతోనే ఉన్న ఆయన.. ఇవాళ ఎందుకు అలా మాట్లాడారో అర్థం కావటం లేదన్నారు. విలీనం వ్యాఖ్యల వల్ల కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినదని ధీమా వ్యక్తం చేశారాయన. పార్టీ మారతారని కూడా అనుకోవటం లేదని సర్దిచెప్పుకున్నారు. పార్టీని బలోపేతం చేయటానికి కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఎల్. రమణ.
మోత్కుపల్లి వ్యాఖ్యలపైనే మరో టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి స్పందించారు. మోత్కుపల్లి కామెంట్స్ షాక్ కు గురి చేశాయన్నారు. పదవుల కోసం మాట్లాడే వ్యక్తి కాదని.. అలా ఎందుకు మాట్లాడారో తెలుసుకుంటాం అన్నారు. ఆయన వ్యవహారం అధినేత చంద్రబాబు చూసుకుంటారని చెప్పుకొచ్చారు.

"data-width="100%" data-numposts="5">