Saturday, November 18, 2017 08

తాగుడు మానేయాల‌నుకుంటున్నారా.. ఇలా చేస్తే స‌రి

మ ద్యపానం ఒంటికే కాదు ఆర్థికంగా కూడా దెబ్బ తీస్తుంది. మోతాదుకు మించి మ‌ద్యం తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయం చెడిపోవ‌డం, ర‌క్త‌నాళాలు దెబ్బ తిన‌డం జ‌రుగుతుంది. త‌మ‌వారిని మందు మాన్పించాల‌నుకుంటున్న‌వారికి, మందు మానేయాల‌నుకునే వారికి ఈ టిప్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

మామా ఎక్ పెగ్గులా.. అరె మామ ఎక్ పెగ్గులా అంటూ.. పెగ్గు మీద పెగ్గు కొట్టే మందుబాబుల‌కు మందు మానేయ‌టానికి మంచి చిట్కా ఇది.


మెంతి డ్రింక్ ..

మానవ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించి, ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. తాగుడికి బానిసైన వారి ఆరోగ్యాన్ని కాపాడి, వారిని ఆ అలవాటు నుండి దూరం చేయడంలోనూ మెంతులు శక్తివంతంగా ఉపయోగపడతాయి. బి. పి షుగర్, అధిక బరువు లాంటి అనారోగ్య సమస్యలను కూడా మెంతి నిలువ‌రిస్తుంది.

కావల్సిన వస్తువులు :

మెంతులు 2 టేబుల్ స్పూన్లు,
తేనె ఒక టేబుల్ స్పూన్

తయారుచేయు విధానం
- మెంతులను నీటిలో వేసి 4, 5 గంటల సేపు నానబెట్టాలి.
- నాలుగు గంటల తర్వాత నీటితో సహా మెంతులను ఉడికించాలి.
- ఉడికించిన నీటిని ఒక గ్లాసులోనికి వడగట్టుకోవాలి.
- వడకట్టిన మెంతి వాటర్లో తేనె కలుపుకుని తాగించాలి.లేదంటే ఉడికించిన మెంతులు ప్లస్ తేనె కలిపి తినిపించినా ఫలితం ఉంటుంది.

- తాగుడు అలవాటు ఉన్నవారికి ఇలా వారంలో రెండు మూడు సార్లు మెంతి డికాక్షన్ తాగిస్తే , డ్యామేజ్ అయిన లివర్ ను కాపాడుకోవచ్చు.

ఉప‌యోగాలు..
ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెంతుల్లో ఉండే చేదు, జిగురు స్వభావం మద్యం అంటేనే ఓ రకమైన ఏహ్యభావం కలిగించేలా చేస్తాయి. కాబట్టి ఎంత మధ్య పాన ప్రియులైనా ఈ మిశ్రమం తిన్నాక మద్యం జోలికి వెళ్లరు.మద్యం మీద మనసు గుంజినప్పుడు మెంతు ఆకులతో చేసిన డికాషన్ ను తాపించాలి. ఇలా మెంతులు+ మెంతు ఆకులు కలిసి.. తాగుడికి అలవాటైన వ్యక్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, వారిని తాగుడు అలవాటు నుండి దూరం చేస్తాయి.