చిన్నారులకు ఆవు పాలు ప్రమాదకరమే

ఆవుపాలు ప్ర‌మాద‌క‌ర‌మేంటంటూ కోపంగా చూడ‌కండి... ఆవు పాలలో చాలా పోష‌కాలు చాలానే ఉంటాయ‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం.. అయితే ఆవు పాలు ఏడాదిలోపు వయసున్న చిన్నారులకు మేలు కన్నా కీడే ఎక్కువని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్ల‌ల‌కు ఆవు పాల‌ను జీర్ణించుకునేంత శ‌క్తి ఉండ‌దు. దాని వ‌ల్ల చిన్నారి మూత్రపిండాలపై ప్రభావం పడటంతో పాటు, శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థలు అలర్జీలకు గుర‌వుతున్న‌ట్లు ర్యాపిడ్‌ సర్వే ఆన్‌ చిల్డ్రన్ (ఆర్‌ఎస్‌ఓసీ) స‌ర్వేలో తేలింద‌ట‌.

తల్లి పాలు లభించని పిల్లలకు ప్రత్యామ్నాయంగా ఆవు పాల కన్నా ఇతర పోషక పదార్థాలను ఇవ్వాలని సూచించారు.


‘ఏడాదిలోపు చిన్నారులకు ఆవు పాలు ఇవ్వడం వల్ల ఆ పాలను వారు జీర్ణించుకోలేరు’ అని పోషకాహార నిపుణుడు నందన్‌ జోషి చెప్పారు. ర్యాపిడ్‌ సర్వే ఆన్‌ చిల్డ్రన్‌(ఆర్‌ఎస్‌ఓసీ) ప్రకారం.. తల్లి పాలు పొం దని చిన్నారుల్లో 42 శాతం మందికి ఆవు లేదా ఇతర జంతువుల పాలను ఆహారంగా ఇస్తున్నారు. ఇవి చర్మ వ్యాధులు, వాంతులు, డయేరియా, కడుపు నొప్పి, కోరింత దగ్గు, అతిగా ఏడవటం లాంటి వాటికి దారి తీస్తున్నాయని పోషకాహార నిపుణులు నిర్ధారించారు. సో చిన్న పిల్ల‌ల‌కి మాత్రం ఆవు పాలు ప‌ట్ట‌కుండా ఉంటేనే బెట‌ర్‌.. షేర్ చేసి ఈ విష‌యాన్ని మీ స్నేహితుల‌తో పంచుకోండి.