తెలంగాణ‌లో ఇక తెలుగు త‌ప్ప‌నిస‌రి

తెలుగు భాషా ప‌రిర‌క్ష‌ణ కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాలు అద్బుతం. తెలుగు భాషా మహాసభలను హైదరాబాద్‌లో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదురోజులపాటు జరుపాలనుకోవ‌డం అభినంద‌నీయం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ బోర్డులు తెలుగులో రాయాలంటూ తీర్మానం చేశారు. వచ్చే ఏడాదినుంచి అన్ని విద్యాసంస్థలు ఒకటో తరగతి మొదలుకుని 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు తెలుగును కచ్చితంగా ఒక సబ్జెక్టుగా బోధించాలని స్పష్టంచేశారు. అటువంటి విద్యాసంస్థలకే రాష్ట్రంలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. కీల‌క నిర్ణ‌యాలు ఇవీ...

-వచ్చే ఏడాది నుంచి ఒక సబ్జెక్టుగా అమలు 
-ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ బోర్డులు తెలుగులో రాయాలి
-ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు
-వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు
-డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో నిర్వహణ
-ప్రారంభ, ముగింపు వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి
-బాధ్యతలు సాహిత్య అకాడమీకి.. నిర్వహణకు రూ.50 కోట్లు
-మహాసభల ఔచిత్యం వివరించేందుకు ప్రపంచవ్యాప్తంగా సమావేశాలు
-హైదరాబాద్‌లో డాక్టర్ సినారె స్మారక మందిరం
-మూడ్రోజుల్లో స్థలం ఎంపిక చేసి.. నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలి