గ‌ణితంలో సున్నా.. ఆర్య‌భ‌ట్ట కంటే ముందే వాడేవారా?

సున్నాని క‌నిపెట్టిందెవ‌రు అంటే.. చిన్న పిల్లాడు సైతం ఆర్య భ‌ట్టా అని ట‌క్కున చెప్పేస్తాడు. అయితే ఆర్య భ‌ట్ట కంటే ముందే సున్నా వాడార‌న్న వాద‌న ఉండేది. ఇక దానిపై బ్రిటీస్ శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న ప్రారంభించి క్లైమాక్స్ కి చేరిన‌ట్టున్నారు. సున్నాను ఓ అంకెగా మొద‌టిసారి వాడిందెవ‌ర‌న్న విష‌యాన్ని సైంటిస్టులు తేల్చేశారు. ప్రాచీన భార‌తీయ ద‌స్త్రాల్లో సున్నాను వాడిన‌ట్టు గుర్తించారు. ఆర్య‌భ‌ట్ట కంటే 500 ఏళ్ల ముందే సున్నాను వాడేవార‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. అయితే . ప్ర‌స్తుతం ల‌భ్య‌మైన ఆధారాల్లో సున్నాను వాడిని అతి ప్రాచీన సంస్కృతి మ‌న‌దే అని స్ప‌ష్ట‌మైంది.

భ‌క్షాలి హ‌స్త‌లిపి 1881లో బ‌య‌ట‌ప‌డింది. పెషావ‌ర్‌కు స‌మీపంలో ఉన్న భ‌క్షాలి గ్రామంలో ఆ లిపి ఆన‌వాళ్లు దొరికాయి. ప్ర‌స్తుతం ఆక్స్‌ఫ‌ర్డ్‌లోని బోడ్లియ‌న్ లైబ్ర‌రీలో ఆ హ‌స్త‌లిపి ద‌స్తావేజులు ఉన్నాయి. సిల్క్ రోడ్డు రూట్‌లో జ‌రిగే వాణిజ్యం కోసం వ‌ర్త‌కులు సున్నాను వాడిన‌ట్లు ఈ లేఖ‌ల ద్వారా అంచ‌నా వేస్తున్నారు.