ఓవర్ సీస్లో 'జై లవ కుశ' హవా.. జై జై జై

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా విడుదలైన తాజా చిత్రం జై లవ కుశ. భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావటంతో అదే స్థాయిలో భారీ వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా జై లవ కుశ రికార్డ్ సృష్టించింది.  ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన జై లవ కుశకు పవర్, సర్థార్ గబ్బర్ సింగ్ చిత్రాల దర్శకుడు బాబీ దర్శకత్వం వహించారు. 

  బుధవారం సాయంత్రమే మొదలైన ప్రీమియర్ షోస్ కు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. దీంతో ప్రీమియర్ షోస్ తోనే 5 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ జై లవ కుశ వసూళ్లను సంబంధించిన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

ప్రీమియర్ షోస్ తో 5,89,390 డాలర్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా గురువారం 1,44,894 డాలర్లను కలెక్ట్ చేసింది. మొత్తంగా 7,34,284 డాలర్ల కలెక్ట్ చేసినట్టుగా ప్రకటించారు. ఇంకా వీకెండ్ కి శుక్ర, శని, ఆది వారాలు మిగిలి ఉండటంతో తొలి వారాంతానికే సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చేస్తుందని భావిస్తున్నారు.