మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల "హ్యాపీ వెడ్డింగ్‌"

ఒక మ‌న‌సు చిత్రంతో తెరంగేట్రం చేసిన మెగా ప్రిన్సెస్ నిహారిక త‌న రెండో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. సుమంత్ అశ్విన్ హీరోగా న‌టించ‌నున్న ఈ సినిమాకి హ్యాపీ వెడ్డింగ్ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. బ్లాక్ బ‌స్ట‌ర్ బ్యాన‌ర్ యువి క్రియేష‌న్స్ మ‌రియు పాక్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. . అక్టోబ‌ర్ 4 నుండి ఈ చిత్రం సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్న‌ట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్ర‌మ‌లో క్రేజి బ్యాన‌ర్ యు వి క్రియోష‌న్స్ బ్యాన‌ర్ తో మేము అసోసియోట్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాము. సుమంత్ అశ్విన్‌, నిహారిక లు జంట‌గా న‌టిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. టొటల్ గా ఈ కాంబినేష‌న్ లో మెట్ట‌మెద‌టిసారిగా తెర‌కెక్కిస్తున్నాము. అక్టోబ‌ర్ 4 నుండి ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెలుతుంది. రోమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాము.. అని అన్నారు..

న‌టీన‌టులు..
సుమంత్ అశ్విన్‌, నిహ‌రిక‌, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, నిరోష త‌దిత‌రులు..

యువి క్రియోష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో
కెమెరా.. బాల రెడ్డి
మ్యూజిక్.. దేవి శ్రీ ప్ర‌సాద్‌
నిర్మాత‌.. పాకెట్ సినిమా
ద‌ర్శ‌క‌త్వం.. ల‌క్ష్మ‌ణ్ కార్య‌